TEJA NEWS

ఉచిత వైద్య శిబిరం లో ముదిగుబ్బ ఎంపీపీ ఆది

నిరుపేదల ఆరోగ్యమే మా కూటమి ప్రభుత్వం సంక్షేమం అన్న ఎంపీపీ

ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలిపిన ఎంపీపీ

ముదిగుబ్బ మండల కేంద్రం లోని బాలుర ఉన్నత పాఠశాల లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్యశాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఉచిత మెగా వైద్య శిబిరంని ఏర్పాటు చేశారు. ముదిగుబ్బ మండల అధ్యక్షులు శ్రీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మండలం లోని మరియు నియోజకవర్గం లోని నిరుపేదలకు అందుబాటులో ఉండేటట్లు అనారోగ్యనికి సంబందించిన పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ తెలిపారు. నిరుపేదల ఆరోగ్యమే మా కూటమి ప్రభుత్వం సంక్షేమం అని ఎంపీపీ అన్నారు. ప్రజలు అందరు ఆరోగ్యంగా వుంటే రాష్టం ఆరోగ్యంగా ఉంటుందని అదే మా ఆకాంక్ష అని ఎంపీపీ తెలిపారు.
ఈ కార్యక్రమం లో మండల కన్వీనర్ అంజన్ రెడ్డి , ముదిగుబ్బ వైద్యులు Dr. రాజేందర్ , మెడికల్ క్యాంప్ చెందిన పెద్దలు సంఘమిత్ర గోశాల , Dr. సాయి తేజా, Dr.శశి మరియు మండల కూటమి నాయకులు టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ క్రిష్ణ మూర్తి,ఓబీ రెడ్డి, ముదిగుబ్బ వైద్య బృందం మరియు పలువురు మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.