TEJA NEWS

జన సైనికుడు స్వర్ణపురి మహేష్ ని అభినందించిన ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ :

ఈరోజు కూకట్ పల్లి నియోజకవర్గంలో 9వ ఫేస్ రోడ్డులో కరోనా సమయము నుండి ప్రతి మధ్యాహ్నం (సుమారు నాలుగు సంవత్సరాలుగా ) జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో డొక్కా సీతమ్మ పేరున అన్నదాన కార్యక్రమం చేస్తున్న మహేష్ ని కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ సేవా దృక్పథం తో నాలుగు సంవత్సరాలుగా ప్రతి పేదలకు డొక్కా సీతమ్మ పేరు మీద అన్నదాన కార్యక్రమము చేస్తూ ఒక్క పూట ఆకలి తీరుస్తున్న మహేష్ మరియు వారి మిత్ర బృందం నకు అభినందనలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో నేటి యువత ఉద్యోగ మరియు వ్యాపార రూపంలో అభివృద్ధి చెందుతూ అవసరమైన వారికి సేవాభావంతో సహాయ సహకారాలు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, కలిగినీడి ప్రసాద్ , గడ్డం వీర, పసుపులేటి ప్రసాద్ ,అంజి ,శిరీష, రమేష్ ,శంకర్రావు ,చాంద్ భాషా, రామకృష్ణ, సాయిరాం చౌదరి,వంశీ, బాలు ,తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS