
కమాన్ చౌరస్తాలో మున్సిపల్ కాలువలపై అక్రమ నిర్మాణాలు తొలగించాలి …. బీసీఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నరాములు ముదిరాజ్ :
అనుమతులు లేనినిర్మాణాల వల్లే ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు
సమస్య పరిష్కరించకుంటే మున్సిపాలిటీ ఎదుట ధర్నా చేపడతా మని హెచ్చరిక
వనపర్తి
వనపర్తి పట్టణంలోని కమాన్ చౌరస్తాలో మున్సిపాలిటీ కాలువలపై అక్రమంగా దుకాణముల షెటర్లు నిర్మించడం వల్ల కాలువలో పేరుకుపోయిన కుళ్ళు , బురద పేరుకుపోయి నీరు నిలువగా ఉండటం వల్ల మురుగు వాసనతో ఆ ప్రాంతమంతా కూరగాయల కోసము కిరాణం కోసం వచ్చిన ప్రజలు దుర్గంధంతో భరించలేకపోతున్నారు . అక్రమంగా ముందుకు జరిగి కాలువలపై నిర్మాణం చేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి కాలువల పైన ఫుట్ పాత్ ఏర్పాటు చేస్తే కాలినడకన పోయే వాళ్లకు ట్రాఫిక్ సమస్య ఉండదు. కాబట్టి వెంటనే అక్రమంగా ముందుకు జరిగి నిర్మించిన షాపులను కూల్చివేసి ట్రాఫిక్ సమస్యను , యాక్సిడెంట్లను తగ్గించాలని, మున్సిపల్ కమిషనర్ శానిటరీ ఇన్స్పెక్టర్ ర్లు తక్షణమే పరిష్కారం చేయాలని లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని బి సి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నాగనమోని చెన్నరాములు ముదిరాజ్ హెచ్చరించారు . అక్రమంగా లంచాలు తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం సబవు కాదని , ఈ విధంగా ముందుకు జరిగి అక్రమ నిర్మాణాలకు ఎలా అనుమతులు ఇస్తారని ఆయన అధికారులను నిలదీశారు. యజమానులు ఇప్పటికైనా వెనక్కి జరిగి తమ నిర్మాణాలు చేసుకొని ట్రాఫిక్ సమస్యలకు అంతరాయం కలిగించకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ప్రయత్నిస్తారని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శులు కే వెంకటేశ్వర్లు , అమడబాకుల రామన్ గౌడ్ మాజీ ఎంపీటీసీ, ఏర్పుల తిరుపతి , పుట్టపాకుల బాలు తదితరులు పాల్గొన్నారు .
