TEJA NEWS

పేటలో గోవధ పై అధికారులు పేపర్ స్టేట్మెంట్లకే పరిమితం, చర్యలు శూన్యం

చిలకలూరిపేట:గోవధ నివారణకు ప్రభుత్వాలు, అధికారులు ఎంతగానో కృషి చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ముఖ్యంగా అధికారుల సమన్వయం లోపబూయిష్టముగాను ఉన్నదీ చిలకలూరిపేట నియోజకవర్గంలో గోవధ నిరాటంకంగా కొనసాగుతోంది. అధికారులు పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్ప, వాస్తవానికి చర్యలు శూన్యమని గోరక్షకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫిర్యాదు చేసినా పట్టించుకోని మున్సిపల్ కమిషనర్

చిలకలూరిపేటలో గోవధపై అనేక ఫిర్యాదులు వస్తున్నా, మున్సిపల్ కమిషనర్ వాటిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.ఫిర్యాదులు అందినా, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల గోవధకు పాల్పడుతున్న వారిలో భయం లేకుండా పోయిందని, ఇది మరింతగా రెచ్చిపోవడానికి దారితీస్తోందని బాధితులు చెబుతున్నారు. అధికారులు తమ బాధ్యతలను విస్మరించడం వల్ల పవిత్రమైన గోజాతికి అన్యాయం జరుగుతోందని పలువురు వాపోతున్నారు.

కమిటీల ఏర్పాటుపై అస్పష్టత

గోవధకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈ కమిటీ ఏసారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. కమిటీలు ఏర్పాటు చేయకపోవడం లేదా ఏర్పాటు చేసినా వాటి పనితీరు అస్సలు లేకపోవడం వల్ల గోవధకు అడ్డుకట్ట వేసే వ్యవస్థ లేదని స్పష్టమవుతోంది. ఇది గమనిస్తే, నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆవేదనలో గోరక్షకులు, చిన్న దూడలనూ వదలని దురాగతాలు

గోవులను రక్షించడానికి ముందుకు వస్తున్న వారికి అధికారుల నుండి ఎటువంటి సహకారం లభించడం లేదు. “ఆవులను రక్షించేవారు లేరంటూ” బాధితులు కన్నీటిపర్యంతమవుతున్నారు. గోవధకు పాల్పడుతున్న వారు చిన్న దూడలను కూడా వదలడం లేదని, వాటిని కూడా దారుణంగా చంపుతున్నారని గోరక్షకులు ఆవేదన చెందుతున్నారు. పాలు ఇచ్చే గోవులను, చివరికి పసి దూడలను సైతం వధించకుండా అడ్డుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

తక్షణ చర్యలు అవసరం

చిలకలూరిపేటలో గోవధను అరికట్టడానికి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులను పరిగణించి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని గోరక్షకులు మరియు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కమిటీలను ఏర్పాటు చేసి, వాటిని సమర్థవంతంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.