
అభయాంజనేయుడి సేవలో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….
131 – కుత్బుల్లాపూర్ డివిజన్ వెంకటేశ్వర నగర్ లోని శ్రీ హరి హర అభయాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న అభయాంజనేయ దేవాలయ దశమ వార్షిక బ్రహ్మోత్సవాలకు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ , డివిజన్ కార్పొరేటర్ కె.ఎం.గౌరీష్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. అభయాంజనేయ స్వామి దయతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో జీవించాలన్నారు. అంతకు ముందు నూతనంగా నిర్మించనున్న దేవాలయ కమాన్ పనులకు ఎమ్మెల్యే , కార్పొరేటర్ శంకుస్థాపన చేశారు. అనంతరం దేవాలయ అభివృద్ధికి పాటు పడుతున్న కాలనీవాసులను ఎమ్మెల్యే సత్కరించారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మధుకర్ రెడ్డి, కోశాధికారి జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి మనోహర్, సభ్యులు మహేష్ కుమార్, కృష్ణా రెడ్డి, సురేందర్ రెడ్డి, బాలకృష్ణ, శ్రీధర్ రెడ్డి, నాగదీప్ గౌడ్, బజార్రెడ్డి, వార్త శ్రీను, మూర్తి, నరసింహ, నర్సింగరావు, రాంబాబు, జగదీశ్వర్, పుండరీకం, మధు, త్రిమూర్తులు, వి.శ్రీనివాస్, భగవాన్ రెడ్డి, గిరి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
