
త్యాగం, ప్రేమ, సమానత్వానికి ప్రతీక బక్రీద్ : బిఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….
128 – చింతల్ డివిజన్ హెచ్ఎంటీ కాలనీలో కుత్బుల్లాపూర్ మండల్ అహ్లే హదీస్ ఈద్గా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బక్రీద్ ప్రత్యేక ప్రార్థనల్లో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. త్యాగం, ప్రేమ, సమానత్వానికి ప్రతీక బక్రీద్ అని అన్నారు. ఈ బక్రీద్ పర్వదినాన ముస్లిం సోదరులు మేకలు, గొర్రెలను ఆ అల్లాకు బలిచి అందులో ఒక భాగాన్ని పేదలకు, మరో భాగాన్ని బంధుమిత్రులకు, మూడవ భాగాన్ని కుటుంబ సభ్యులకు పంచుతూ త్యాగం, ప్రేమ, సమానత్వానికి ప్రతీకగా బక్రీద్ నిలుస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల్ అహ్లే హదీస్ ఈద్గా సొసైటీ సలహాదారులు ఎండి. హమీద్, అడ్వకేట్ హుస్సేన్, ఎండీ.అబ్దుల్ రజాక్, ఎండి.ఇబ్రహీం, అక్బర్ ఖాన్, ప్రెసిడెంట్ ముహమ్మద్ ఆదిల్, ఉపాధ్యక్షులు ఎండి. ఇబారత్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హకీమ్, కోశాధికారి ఎండీ. సిరాజ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ అబ్దుల్ బరి తదితరులు పాల్గొన్నారు.
