TEJA NEWS

గాంధీజీ జయంతి వేడుకలలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్

శంకర్పల్లి : గాంధీజీ జయంతి సందర్భంగా శంకర్‌పల్లి మున్సిపాల్టీ ఆవరణలో గాంధీజీ చిత్రపటానికి మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆమె మాట్లాడుతూ గాంధీ అహింసా మార్గంతోనే దేశానికి స్వాతంత్రం సాధించామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


TEJA NEWS