మున్నా కు ప్రశంసా పత్రంతో సన్మానం

మున్నా కు ప్రశంసా పత్రంతో సన్మానం

TEJA NEWS

కామారెడ్డి లో నూతన సంవత్సర కానుకగా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ మరియు మానవ హక్కుల సలహా సంఘం ఆధ్వర్యంలో మున్నా కు ప్రశంసా పత్రంతో సన్మానం.

కామారెడ్డి: (సోమవారం 1/1/24 ), జనవరి ఒకటవ తేదీన కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి హతిథి గృహంలో 2024 నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం జరిగినది. అలాగే సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ మరియు మానవ హక్కుల సలహా సంఘం ఆధ్వర్యంలో మున్నా ను ఉత్తమ పనితీరు సర్టిఫికేట్ తో సన్మానించారు . ఇట్టి కార్యక్రమానికి సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఏం ఏ సలీమ్ ముఖ్యంగా అతిథిగా పాల్గొన్నారు ,అలాగే విశిష్ట అతిథులుగా జాతీయ మహిళ సంక్షేమ సంఘ (నేషనల్ వుమెన్ అంబాసిడర్ ) అధ్యక్షురాలు శ్రీమతి శీబా రాణి మరియు జాతీయ డైరెక్టర్ (విఐపి మానవ హక్కుల సంఘం), మరియు రాష్ట్ర సలహాదారులు (సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ) మొహమ్మద్ జహంగీర్ (మున్నా), అజిత్ ఖాన్ మరియు మానవ హక్కుల సహాయ సంఘం తెలంగాణ రాష్ట్ర సంఘ చైర్మన్ మహమ్మద్ సాహిల్ ఖాన్, ప్రత్యేక అతిధులుగా సహ చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎం. రాజన్న మరియు రాష్ట్ర ముఖ్య సలహాదారులు డాక్టర్ పుట్ట మల్లికార్జున్ గారు మరియు జోనల్ అధ్యక్షులు సిర్లపల్లి ప్రదీప్ కుమార్, కార్యదర్శి లికెల రాజు, అలాగే కామారెడ్డి జిల్లా అధ్యక్షులు శివపూజ లింబయ్య , జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వి భాస్కర్, జిల్లా ప్రతినిధులు మదర్ భాష, రతన్ కుమార్, చిన్నస్వామి ,వడ్ల శీను, సుదర్శన్ అన్వర్ ,బట్టు శ్రీనివాస్ ,డైరీ లింగం ,సిహెచ్ గంగయ్య ,రాజూ, రమేష్, తదితరులు పాల్గొని నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకున్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS