నా అకౌంట్ మాజీ మంత్రి బ్లాక్ చేశారు..
షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి ఏఐసీసీ అధిష్టానం కురియన్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో రెండు రోజులుగా పలువురు కాంగ్రెస్ నేతలను పిలిచి వివరాలను తీసుకుంటుంది. పోటీ చేసిన అభ్యర్థులతో కురియన్ కమిటీ విడివిడిగా మాట్లాడుతుంది. ఒక్కో అభ్యర్థికి 30 నిమిషాల సమయాన్ని కమిటీ కేటాయించింది. ఈరోజు(శుక్రవారం) కురియన్ కమిటీతో ప్రభుత్వం సలహాదారు షబ్బీర్ అలీ ముందు హాజరయ్యారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఓట్ల తేడా అడిగారని షబ్బీర్ అలీ తెలిపారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడానికి గల కారణాలను అడిగారని చెప్పారు. నిజమాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్‌కు 17 వేల మెజార్టీ వచ్చిందని చెప్పానని అన్నారు. కామారెడ్డిలో పార్లమెంట్, అసెంబ్లీ లో మెజార్టీ చెప్పానని వివరించారు.
‘‘ఉదయం నుంచే పోలింగ్ బూత్‌ల నుంచి బీఆర్ఎస్ ఏజెంట్లు బయటికి వెళ్లి పోయారు. బీఆర్ఎస్ ఓటర్లు బీజేపీకి ఓట్లు వేసింది. బాన్సు వాడలో అసెంబ్లీలో బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి కి 27 లీడ్ వచ్చింది. పార్లమెంట్‌లో 18 వేల మైనస్ ఓట్లు పడ్డాయి. మాజీ మంత్రి కేటీఆర్ కంటే నేను సీనియర్ లీడర్‌ని. మంత్రిగా సీనియర్‌ని ఛాలెంజ్ చేస్తున్న ముందు ఫిరాయింపులకు పాల్పడింది ఎవ్వరు. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ని రాజీనామా చేయించకుండా మంత్రిని చేశారు. 46 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో నలుగురిని చేర్చుకుని కాంగ్రెస్ పార్టీని విలీనం చేశారు. ఎమ్మెల్సీలను అలాగే చేర్చుకున్నారు. వాస్తవం కాదా రుజువు చేస్తా. పదవికి రాజీనామా చేసి బయటకు వెళ్లి పోతా. కేటీఆర్ రుజువు చేయాలి చేయకుంటే రాజీనామా చేయాలి. ఈ విషయం గురించి నేను కేటీఆర్‌కు ట్వీట్ చేశా. నా ట్విట్టర్ అకౌంట్‌ని బ్లాక్ చేసిండు. వాళ్ల అందరిని అంగట్లో కొన్నట్లు కొన్నారు. ఇప్పుడు అభివృద్ధి కోసం మా పార్టీ లోకి వస్తున్నారు. వాళ్లు పార్టీని కూలగొట్టిండ్రు. మేము బీఆర్ఎస్‌ను కూలగొడతాం. త్వరలో అందరూ కాంగ్రెస్‌లోకి వస్తారు’’ అని షబ్బీర్ అలీ తెలిపారు..