నల్లగొండను నందనవనంగా తీర్చిదిద్దుతా..

నల్లగొండను నందనవనంగా తీర్చిదిద్దుతా..

TEJA NEWS

Nalgonda will be transformed into Nandanavana..


నల్లగొండను నందనవనంగా తీర్చిదిద్దుతా. రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. నల్గొండ పట్టణాన్ని అన్ని రకాలుగా తీర్చి దిద్దడంతో పాటు ఉదయ సముద్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బక్రీద్ సందర్భంగా మునుగోడు రోడ్డులో ఉన్న ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న అనంతరం పానగల్ ఫ్లై ఓవర్ సర్వీస్ రహదారిలో 5 కోట్ల రూపాయల వ్యయంతో చేప ట్టిన భూగర్భ డ్రైనేజీ పనులను తనిఖీ చేశారు.. ఈ సందర్భంగా మంత్రి అధికారులు,కాంట్రాక్టర్ కు పలు సూచనలు చేశారు.. మ్యాన్ హోల్స్ వద్ద క్యూరింగ్ బాగా చేయా లని,పట్టణానికి డ్రైనేజీ సమస్య లేకుండా,శాశ్వత పరిష్కారం ఉండేలా పనులు చేపట్టాలని ఆదేశించారు.. గత ప్రభుత్వంలో డ్రైనేజీ లైన్ తీయకుండా హడావుడిగా పనులు పూర్తి చేశారని.. ఈ డ్రైనేజీ పనులు చేయకపోవడం వల్ల పానగల్ ఫ్లైఓవర్ వద్ద ఇబ్బందులు తలెత్తాయన్న ఉద్దేశంతో తక్షణమే రూ.5.5కోట్లు మంజూరు చేయించి భూగర్భ డ్రైనేజీ పనులను పూర్తి చేయిస్తున్నామని పేర్కొన్నారు..పట్టణంలో ఎంత వర్షం వచ్చినా చుక్క నీరు నిలవకుండా చేస్తున్నామని,జాతీయ రహదారిని పట్టణంలో నుండి తీసుకెళ్లడం ద్వారా రామాలయం,చర్చి,ఆంజనేయస్వామి గుడి,కబరస్తాన్,దేవరకొండ రోడ్ లోని షాపులు వంటివి కోల్పోతున్నాయని,పట్టణం నుండి జాతీయ రహదారి వెళ్లకుండా నల్లగొండ పట్టణం బయట నుండి రూ.700 కోట్ల వ్యయంతో రింగ్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.. పట్టణంలోకి హెవీ వాహనాలు ఏవి రాకుండా ఔటర్ రింగ్ రోడ్డుపై నుం చి వెళ్లేలా పనులు ప్రారంభించ బోతున్నామని,అందులో భాగంగానే పానగల్లు వద్ద ఛాయా సోమే శ్వరాలయం సమీపంలో ఇందిరా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇందిరాగాంధీ చౌరస్తాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని వివరించారు.. ఉదయ సముద్రాన్ని టూరిజం స్పాటుగా అభివృద్ధి చేస్తామని,చoదనపల్లి వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ లో ట్రీట్మెంట్ ప్లాంటు ఏర్పాటు చేయబోతున్నామని,దేవరకొండ రోడ్ లో ఉన్న సెయింట్ ఆల్ఫన్సెస్ హైస్కూల్ వద్ద ఎస్కలే టర్ తో కూడిన రోడ్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.. తద్వారా సుమారు విద్యార్థిని,విద్యార్థులకు రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా నివారిస్తున్నామని,దేవరకొండ రోడ్డులో ఉన్న వైయ స్సార్ సర్కిల్ కూడా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.. నల్లగొండ అవుటర్ రింగ్ రోడ్డు కింద భూములు,ఇండ్ల స్థలాలు కోల్పోయే వారికి మార్కెట్ రేట్ ప్రకారం పరి హారం అందించడమే కాకుండా,ప్రత్యామ్నాయంగా ఇళ్ల స్థలాల ను కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

పట్టణంలో ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయడంతోపాటు ప్రమాదాలకు కారణమయ్యే చెట్లను తొలగిస్తున్నామని,మంత్రితో పాటు,పనుల ను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్,కౌన్సిల ర్లుతదితరులు ఉన్నారు..

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి