Nallagutta Sri Lakshmi Narsimha Swamy Kalyana Mahotsavam
నల్లగుట్ట శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ .
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం డివిజన్, నల్లగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శ్రీశైలం గౌడ్ ని ఘనంగా సత్కరించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి చల్లని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఇంద్రసేన గుప్తా, యాదగిరి, శ్రీరాములు, యాం సాగర్, సురేష్, నర్సింహారెడ్డి, లక్ష్మణ్, సంజీవరెడ్డి, నరసమ్మ, కావలి శ్రీనివాస్, శంకర్ రెడ్డి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.