TEJA NEWS

శేషగిరిరావు మృతి పార్టీకి తీరని లోటు : నామ

ఖమ్మం జిల్లా బి.ఆర్. ఎస్. పార్టీ సీనియర్ నాయకులు, తల్లాడ మండల తొలి ఎంపీపి, ఖమ్మం జిల్లా మాజీ డీసిఎంఎస్ చైర్మన్, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం కృషి చేసిన రాయల వెంకట శేషగిరిరావు అకాల మరణం పట్ల ఖమ్మం ఎం.పి, బి. ఆర్. ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు నామ నాగేశ్వర రావు బుధవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. గత 20 సంవత్సరాలుగా తనతో ఉన్న రాజకీయ అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా తనతో కలిసి చేసిన ప్రయాణాన్ని నామ గుర్తు చేసుకుంటూ వారు ఎప్పుడూ రైతాంగ సమస్యల గురించే ఆలోచించే వారన్నారు. ఒక మంచి నాయకున్ని కోల్పోవడం పార్టీకి తీరని లోటన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


TEJA NEWS