TEJA NEWS

నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ పనులు మేఘా, రాఘవ కన్ స్ట్రక్షన్స్‌కు అప్పగించడంపై కేటీఆర్ ఆగ్రహం

ఈ ప్రాజెక్ట్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని మండిపాటు

మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్, మేఘా సంస్థలకు ప్రాజెక్ట్ పనులను కేకు ముక్కలుగా పంచారన్న కేటీఆర్

L&T, NCC లాంటి కంపెనీలను కాదని అనునాయులకు కట్టబెడితే ప్రజలు గమనిస్తారన్న సోయి లేకుండా బరితెగింపు?

సుంకిశాల ప్రమాదానికి కారణమైన మేఘాను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాల్సింది పోయి, వారికే ఈ ప్రాజెక్ట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారా?

కాంగ్రెస్ ఖజానా నింపుకునేందుకు తెలంగాణను ఏటీఎం‌గా వాడుతున్నారని ఆవేదన

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ పనులను మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్, మేఘా ఇంజినీరింగ్ సంస్థలకు కట్టబెట్టడంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి, మేఘా సంస్థకు ఈ టెండర్లు దక్కేలా చేయడమంటే “నీకు ఇది-నాకు అది” అని క్రోని క్యాపిటలిజానికి పాల్పడుతూ


TEJA NEWS