Narendra Modi should be held responsible for NEET leakages: AISF, AIIF
నీట్ లీకేజీలకు నరేంద్ర మోడీ బాధ్యత వహించాలి: ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
వనపర్తి
బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే నీట్ పేపర్ల లీకేజీ జరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. వనపర్తి అంబేద్కర్ చౌక్ లో నీట్ రద్దు చేయాలని ధర్నా, పేపర్ లీకేజీకి నిరసన చేపట్టారు. బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పేపర్ లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పరీక్ష సందర్భంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి వంశీ, జిల్లా ఇన్చార్జ్ లు జె.రమేష్, గోపాలకృష్ణ మాట్లాడారు. ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి చదివిన విద్యార్థులు లీకేజీతో నష్టపోయారన్నారు. విద్యార్థుల జీవితాలతో బీజేపీ ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆరోపించారు. ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే పేపర్ లీకేజీ జరిగిందని ఆరోపణలు వచ్చాయన్నారు. ఒకే కేంద్రంలో ఆరుగురికి 720 మార్కులు రావడం పలు అనుమానాలకు లీకేజీ పైసిట్టింగ్ చేస్తే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను రద్దుచేసి వీలైనంత త్వరగా మళ్లీ పరీక్షలు జరిపించాలన్నారు. రద్దు చేసేదాకా పోరాటం కొనసాగిస్తామన్నారు. శ్రీరామ్, మహేష్, చంద్రశేఖర్, మోహన్, రాము, అశోక్ తదితరులు పాల్గొన్నారు.