TEJA NEWS

త్రిస్సూర్ లో జాతీయ పన్ను సదస్సు విజయవంతం

ఉమ్మడి ఖమ్మం

ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ దక్షిణ విభాగము ఆధ్వర్యంలో కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ లో నిర్వహించిన జాతీయ పన్ను సదస్సులో  ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులలో ఎదుర్కొంటున్న  సవాళ్ళ పై  జరిగిన చర్చాగోష్ఠి లో ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ దక్షిణ విభాగపు సంయుక్త కార్యదర్శి ఉల్లిబోయిన సైదులు (ఖమ్మం) తెలంగాణ తెలంగాణ టాక్స్ ప్రాక్టీషనర్స్ పూర్వ అధ్యక్షులు మరియు ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ దక్షిణ విభాగపు కార్యనిర్వాహక కమిటీ ప్రస్తుత సభ్యులైన నగేశ్ రంగి పాల్గొని వృత్తిపరమైన నీతి అనే అంశంపై ప్రసంగించారు.

ఉదయం జరిగిన  కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా కేరళ ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తి హరిశంకర్ వీ మీనన్ హాజరై ప్రసంగించారు. కార్యనిర్వహక కమిటీ చైర్మన్ గణేశన్ కన్వీనర్ రామచంద్రన్ కోశాధికారి విజయన్ ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ పూర్వాధ్యక్షులు మల్లాది శ్రీనివాసరావ్ మరియు దక్షిణ విభాగపు చైర్మన్ రామరాజు శ్రీనివాసరావ్ కార్యదర్శి చక్ర రమణ ఏపీ టాక్స్ బార్ అసోసియేషన్ కార్య నిర్వాహక సభ్యులైన నెమ్మాని సోమేశ్వర్ తెలంగాణ టాక్స్ ప్రాక్టీషనర్స్ సభ్యులైన యోగానంద్ మరియు చీడే అయ్యప్ప పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా నుండి హాజరైన సీనియర్ సభ్యులైన చీరాల మల్లికార్జున్ దేవ్ ను కార్యనిర్వాహక కమిటీ ఘనంగా సత్కరించారు


TEJA NEWS