TEJA NEWS

సర్వజ్ఞ విద్యార్థినికి “నాట్యమయూరి”

హైదరాబాద్ లో ఈ నెల 24 న రవీంద్ర భారతి లో” నృత్యమాల నాట్య కళా వెల్ఫేర్ సొసైటీ” వారు తెలంగాణ బోనాల సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి నాట్య పోటీలలో పాల్గొని నాట్య మయూరి గ నిలిచినా మా సర్వజ్ఞ విద్యార్థిని పి. యోగ్నశ్రీ ని సర్వజ్ఞ పాఠశాల యాజమాన్యం అభినందించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కళాకారులతో పోటీపడి సర్వజ్ఞ విద్యార్థిని అత్యుత్తమ పురస్కారాన్ని కైవసం చేసుకున్నది. సర్వజ్ఞ పాఠశాల విద్యార్ధులు ఈ రంగంలోనే కాక చెస్, టేబుల్ టెన్నిస్, చిత్రలేఖనం, ఒలింపియాడ్ పోటీలలో గొప్ప ప్రతిభను కనబరచి మా సర్వజ్ఞ విద్యాసంస్థ యొక్క గౌరవాన్ని పెంపొందించారు. ఇలాంటి కళలను ప్రోత్సహించడంలో సర్వజ్ఞ ఎప్పుడు ముందంజలో ఉంటుంది. కేవలం చదువుకే పరిమితం కాకుండా అన్ని రంగాలలో సర్వజ్ఞ విద్యార్ధులు వారి ప్రతిభను కనబరచాలని, అందుకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తూ విద్యార్ధుల పురోగతికి పాఠశాల యాజమాన్యం ఎప్పుడు తోడ్పడుతుంది. ఈ సందర్భంగా సర్వజ్ఞ పాఠశాల డైరెక్టర్ ఆర్వీ. నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థిని ఇంత అద్భుతమైన ప్రతిభను కనబరిచినందుకు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. సర్వజ్ఞ పాఠశాల ఖమ్మం విడిఒస్ కాలనీ నందు అత్యంత సౌకర్యంగా, ఎ.సి గదులతో ఎంతో అనుభవం కలిగిన అధ్యాపకులతో తరగతులను నిర్వహిస్తూ తక్కువమంది విద్యార్ధులకు ఉన్నత విలువలతో కూడిన విద్యను అందిస్తూ అన్నింటా సర్వజ్ఞ తనకు తానే సాటి అని నిరూపించుకుంటుంది. ఈ సందర్భంగా డైరెక్టర్స్ ఆర్వీ. నాగేంద్ర కుమార్, నీలిమా, పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది మరియు తోటి విద్యార్ధులు యోగ్నశ్రీ ని అభినందించారు. మున్ముందు మరెన్నో విజయాలను సాధించాలని యోగ్నశ్రీ ని ఆశీర్వదించారు.

సర్వజ్ఞ విద్యార్థినికి “నాట్యమయూరి

TEJA NEWS