TEJA NEWS

నవోదయ పాఠశాలనైనా కుత్బుల్లాపూర్ కు తీసుకురావాలి.
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

కేంద్ర ప్రభుత్వం నిన్న తెలంగాణ రాష్ట్రానికి జవహర్ నవోదయ పాఠశాలలను మంజూరు చేయగా అందులో ఒకటి మేడ్చల్ జిల్లాకు కూడా కేటాయించబడిందని దీనినైనా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు ఎమ్ ఎల్ ఏ, ఎమ్ ఎల్ సి లు కలిసి నవోదయ పాఠశాలనైనా కుత్బుల్లాపూర్ కు తీసుకువచ్చెందుకు కృషిచెయ్యాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ డిమాండ్ చేశారు.

ఇప్పటికే కుత్బుల్లాపూర్ కు మంజూరైన గురుకుల కళాశాల,మెడికల్ కళాశాల,గురుకుల విద్యాలయం లు ఇతర ప్రాంతాలకు తరలి పోయాయని వాటి గురించి ఇప్పటివరకు సిపిఐ తప్ప ఇతర రాజకీయ పార్టీలు నేటివరకు మాట్లాడిన సందర్భాలు కానీ, వాటిని ఇక్కడికి తీసుకురావడనికి ఎటువంటి ప్రయత్నాలు చెయ్యలేదని ఇప్పటికైనా అధికార పార్టీ కంగ్రెస్ నాయకులు,స్థానిక శాసన సభ్యుడు వివేకానంద లు చోరువ తీసుకొని అన్ని రాజకీయ పార్టీలను సీఎం దగ్గరికి తీసుకెళ్లి మన ప్రాంతానికి మంజూరు అయిన వాటిని మన ప్రాంతానికి వచ్చే లాగా చూడాలని అన్నారు.
ఒకవేళ వారికి ప్రజల పై ప్రేమ లేకపోతే, వారికి సమయం లేకపోతే సిపిఐ ఆధ్వర్యంలో అన్ని పార్టీలను ఆహ్వానిస్తామని అప్పుడు తేదీ ఖరారు చేసి వెళ్దామని దానికైనా సిద్ధం కావాలని కోరారు.


TEJA NEWS