
ఆరోగ్యకరమైన సమాజానికి “యోగా” అవసరం
- శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు.శంకర్
(గార – )
ఆరోగ్యకరమైన సమాజానికి “యోగా” అవసరమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు.శంకర్ అన్నారు. చారిత్రిక ప్రదేశాలలో ఒకటైన గార మండలం, శాలిహుండంలోగల బౌద్ధ స్మారక ప్రదేశములో నెలరోజుల యోగాంధ్ర వేడుకలలో భాగంగా శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజరాపు. రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలసి యోగాంధ్రాలో పాల్గొన్న శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు.శంకర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల పాటు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ శ్రీకాకుళంలో యోగాంధ్రను పండగలా నిర్వహిస్తున్నామని, జూన్ 21న విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుందని, ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారన్నారు. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరు యోగా చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారని, మన శరీరం, మనసును ఆధీనంలో ఉంచుకునేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. యోగాను మరింత విస్తృంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కేంద్ర మంత్రి కిజరపు.రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు.అచ్చంనాయుడు, జిల్లా కలెక్టర్ తోపాటు, అధికారులు చేస్తున్న కృషి వెలకట్టలేనిదన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా.చంద్రబాబు నాయుడు, బావితర నేత నారా. లోకేష్ బాబు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల .పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి కిజరపు.రామ్మోహన్ నాయుడుల పై అపారమైన నమ్మకంతో, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, యోగాంధ్ర వేడుకను విశాఖపట్టణములో నిర్వహిస్తున్నారన్నారు. బారతీయ జీవన విధానంలో యోగా భాగమైందని, యోగాతో ఒత్తిడిని జయించి, శారీరక, మానసిక ఆరోగ్యం సొంతమౌతుందని, బలం, వశ్యత, సమతుల్యతను ఇస్తుందని, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల జిల్లా అధికారులు, అనధికారబృందం, స్థానిక ప్రజలు, యోగ శిక్షకులు, యోగ సాధకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
