బీజేపీ జిల్లా ఆర్మీ సెల్ అధ్యక్షులు గా నీల చంద్రం
సిద్దిపేట జిల్లా బీజేపీ ఆర్మీ సెల్ అధ్యక్షులు గా రాయపోల్ మండలం అనాజిపూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ నీల చంద్రం ను నియమించారు..సిద్దిపేట లో జిల్లా పార్టీ కార్యాలయంలో నీల చంద్రం కు జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి నియామక పత్రం అందించారు. ఆర్మీ జవాన్ గా 18 ఏళ్ళు దేశం కోసం పనిచేసిన నీల చంద్రం ఇటీవల పదవీ విరమణ చేశారు..అనంతరం ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారు..సైనికునిగా పనిచేస్తూనే గజ్వెల్ లో ఆజాద్ డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు చేసి ఎంతో మంది యువకులకు శిక్షణ అందించి ఆర్మీ లో అవకాశం కల్పించారు..తనపై నమ్మకం తో జిల్లా ఆర్మీ సెల్ అధ్యక్షుడు గా అవకాశం కల్పించడంపై ఎంపీ ఎం రఘునందన్ రావు కి, జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి కి, జిల్లా కార్యదర్శి విభూషన్ రెడ్డికి, రాయపోల్ మండల పార్టీ అధ్యక్షుడు రాజా గౌడ్ కి, బీజేపీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ పార్టీ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ఆర్మీ కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు
బీజేపీ జిల్లా ఆర్మీ సెల్ అధ్యక్షులు గా నీల చంద్రం
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…