TEJA NEWS

మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను ఇస్నాపూర్ మైనార్టీ నాయకులు, మత పెద్దలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. చిట్కూల్ లోని ఎంపీ అభ్యర్థి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన వీరంతా నీలం మధు ముదిరాజ్ సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ పార్లమెంట్ ఎన్నికలలో ముస్లిం మైనార్టీల తరఫున తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ అమీర్, అమీర్, మహమూద్, రహీం, తాహెర్, అబ్దుల్ గని, తన్వీర్, సలీం, ఆసిఫ్, మోబిన్, గౌస్, సాజిద్, హారిఫ్ పాల్గొన్నారు.


TEJA NEWS