నీట్ గ్రేస్ మార్కులు రద్దు కాదు, లీకేజీ పై విచారణ జరపాల నీ……. ఎస్ఎఫ్ఐ నిరసన

నీట్ గ్రేస్ మార్కులు రద్దు కాదు, లీకేజీ పై విచారణ జరపాల నీ……. ఎస్ఎఫ్ఐ నిరసన

TEJA NEWS

NEET grace marks should not be cancelled, investigation should be done on leakage....SFI protest

నీట్ గ్రేస్ మార్కులు రద్దు కాదు, లీకేజీ పై విచారణ జరపాల నీ……. ఎస్ఎఫ్ఐ నిరసన

వనపర్తి :
దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష, లీకేజీ తో ఫలితాలు గందరగోళం సృష్టించడంతో గ్రేస్ మార్కులను పొందిన వారి మార్కులనే రద్దు చేస్తూ జూన్ 23న రీ ఎక్షమ్ నిర్వహించి జూన్ 30న ఫలితాలు ఇస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలపడం సరికాదని అసలు పేపర్ లీకేజీ పై విచారణ జరిపించాలని జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్లగ్ గార్డ్ లు ధరించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం. ఆది మాట్లాడుతూ నీట్ లీకేజ్ పై కేంద్రం స్పందించకుండా ఎవరైతే గ్రేస్ మార్కులు పొందారో వారి స్కోర్ కార్డులు రద్దుచేసి వారికి మాత్రమే మళ్ళీ రీ ఎగ్జామ్ నిర్వహించడం అంటే నీట్ అవకతవకలు పక్కదారి పట్టించడమేనని దీనివల్ల ర్యాంకులు తారుమారు అయ్యి గందరగోళం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష ఫలితాలపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఎన్. టి.ఏ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు బిజెపి పాలిత రాష్ట్రాల్లో మాత్రమే నీటు ర్యాంకులు పేపర్ లీకేజీలు ఆరోపణలు వచ్చాయని లీకేజీ వ్యవహారం సిబిఐకి అప్పజెప్పి సుప్రీంకోర్టు నేతృత్వంలో విచారణ జరిపించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించి విద్యార్థులకు న్యాయం చేయాలని లేదంటే దేశవ్యాప్తంగా మంత్రుల ఇళ్ళను ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కుమార్, సాయి, చరణ్, ఈశ్వర్,మహేష్,శ్రీలత, మాధవి తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి