TEJA NEWS

ఘనంగా “నల్ల పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్టాపన” కార్యక్రమం…

కొంపల్లి మున్సిపాలిటీ పరిధి దూలపల్లిలో నూతనంగా నిర్మించిన నల్ల పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ నల్ల పోచమ్మ తల్లి దయతో ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా సుఖ సంతోషాలతో జీవించాలన్నారు.

ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, కౌన్సిలర్ డప్పు కిరణ్, నాయకులు బొమ్మ ప్రవీణ్, మహేష్, రాజు, రఘునాథ్, మధు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS