TEJA NEWS

డ్రగ్స్‌ కేసుల్లో ఏ స్థాయి ప్రముఖులున్నా ఉపేక్షించేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టంచేశారు. సినీ ప్రముఖులు, రాజకీయనాయకులున్నా డ్రగ్స్‌ ఇతర కేసుల్లో ఎంత పెద్దవారున్నా వదిలేదిలేదన్నారు. ఇప్పటికే ప్రభుత్వం హుక్కా సెంటర్లను నిషేధించిందని, కోర్టు అనుమతిలో 12 హుక్కా కేంద్రాలు నడుస్తున్నట్టు తెలిపారు. ‘రాజకీయ, సినీ ప్రముఖులెవరూ చట్టానికి అతీతులు కారు. నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌లపై 14ఎఫ్‌ఐఆర్‌లు, 21 పెట్టి కేసులు నమోదు చేశారు.

నార్సింగిలో ఓ సినీ నటుడికి సంబంధించి కేసు నమోదైంది. మత్తు మందు వినియోగిస్తున్నారనే ఫిర్యాదులతో కాలేజీలు, పాఠశాలలపై నిరంతర నిఘా పెట్టాం. పలు కాలేజీలకు నోటీసులు జారీ చేశాం. డ్రగ్స్‌ వినియోగించినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. పబ్‌లలో డ్రగ్స్‌, గంజాయి దొరికితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. గ్రామాల్లో సైతం డ్రగ్స్‌ సమస్యలు పెరుగుతున్నాయి’ అని మంత్రి అన్నారు.


TEJA NEWS