TEJA NEWS

గ్యారెంటీ లేని మాఫీ..
మిత్తి పైసలు కట్టేందుకు అప్పులు చేస్తున్న అన్న దాతలు.
అంతా ఆగమాగం…అయోమయం.
రాష్ట్రమంతా ఇవే తిప్పలు…12 రోజులుగా తప్పని ప్రదక్షిణలు
ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదల కోసం ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం పాలసీ ప్రకటించలేదు
బిఅర్ఎస్ పార్టీ నాయకులు దాచారం కనకయ్య


సిద్దిపేట జిల్లా జగదేవపూర్ తెలంగాణలో రైతుల రుణమాఫీ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు దాచారం కనకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాచారం కనకయ్య మాట్లాడుతూ
తెలంగాణలో రైతుల రుణమాఫీ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు పై బి అర్ ఎస్ పార్టీ నాయకులు దాచారం కనకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.డిసెంబర్ తొమ్మిదో తేదీన రుణమాఫీ చేస్తామని కాలయాపన చేస్తుందన్నారు.
లక్ష, లక్షన్నర లోపు రుణాలు తీసుకున్న రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకు పోతున్నా.. క్షేత్రస్థాయి లో వేల మంది రైతులకు ఇంకా మాఫీ కాలేదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎందుకు మాఫీ కాలేదని.. అటు వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ, ఇటు బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని. రుణమాఫీ అయినవాళ్లూ మిత్తి పైసలు కట్టేందుకు నానా కష్టాలు పడుతున్నారని తెలిపారు. వడ్డీ కడితేనే మాఫీ అని బ్యాంకులు తెగేసి చెప్పడంతో దిక్కులేక కొత్తగా అప్పు తెచ్చి మరీ కడుతున్నారు. ఒక్కోక మండలం లో ఒక్కో పరిస్థితి..అంతా అయోమయం.. గందరగోళం.వాస్తవ సంఖ్య కు రుణమాఫీ అయిన సంఖ్యకు రెట్టిం పు స్థాయిలో వ్యత్యాసం ఉండటమే ఇందుకు కారణం అన్నారు. ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పేదల కోసం ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం పాలసీ ప్రకటించలేదని సూచించారు.
భరాస ఆయాంలో మేము రెండు పంటలకు రైతుబంధు ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎగ్గొడుతుంది. మేము రైతులకు ఇచ్చిన డబ్బులను దుర్వినియోగం చేసినట్టు ఆరోపిస్తున్నారు. ఇది పూర్తిగా రైతు శత్రువు ప్రభుత్వం అని సూచించారు. భరోసాయంలో ఉన్న సంక్షేమ పథకాలు విద్యుత్ నీటి సరఫరా గొర్రెల పంపిణీ. కెసిఆర్ కిట్టు. రైతుబంధు రైతు బీమా. కళ్యాణ లక్ష్మి. మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ. రైతు భరోసా గురించి ప్రభుత్వం అన్నదాతలను ప్రజలను గొంతు కోసింది అన్నారు.
దళిత బంధు పథకం ప్రస్తావనే లేదని దళితులు అంటే ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఇదేనా గొర్రెల పెంపకం పథకానికి తూట్లు పొడిచారని ఒత్తి పలకడం తప్ప బట్టి కొత్తగా చెప్పిందేంలేదని రైతులను పొగిడినట్టే పొగిడి నిండా ముంచారని తెలిపారు.
ఆరోగ్య లక్ష్మి కింద రూ. 10 లక్షల పథకం అమలు చేస్తే, రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా రూ. 10 లక్షలు ఇచ్చారా అని ప్రశ్నించారు. మహిళలకు రూ. 2500 ఇస్తామన్న మాట ఏమైందని, వృద్ధులకు డిసెంబరు నెల నుంచి రూ.4 వేల పెన్షన్‌ ఇస్తామని, ఏడు నెలలైనా ఇప్పటికీ అమలు కాలేదన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డిసెంబర్ నుంచి జూలై దాకా వడ్డీని తమే భరిస్తామని రైతుల నుంచి వసూలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.


TEJA NEWS