తెలంగాణలో ఉద్యమం నాటి పరిస్థితులు..
మళ్లీ ప్రత్యర్థి కాంగ్రెస్సే..ప్రజల పక్షానా బీఆర్ఎస్సే…………………….*BRS ఉద్యోగస్తులు సంఘం వనపర్తి జిల్లా కార్యదర్శి గాడిల నవీన్
వనపర్తి
తెలంగాణ లో మళ్ళీ ఉద్యమం నాటి పరిస్థితులు ఏర్పడ్డాయని బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగస్తుల సంఘం జిల్లా కార్యదర్శి గాడిల నవీన్ శనివారం ఆరోపించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా, రైతు రుణమాఫీతో రైతులను డొఖా చేసి,ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏడాదిలో 2లక్షల ఉద్యోగాల జాతర అనే హామీకి పాతరేసి నిరుద్యోగుల ఆశలను చిదిమేసరాన్నారు,సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కినా కనికరించకుండా కాఠిన్యం చూపారని ఆయన అన్నారు..
నాడు బీఆర్ఎస్ హయాంలో సకల జనుల సంక్షేమ తెలంగాణ..నేడు కాంగ్రెస్ పాలనలో సంక్షోభం వైపు పయనం,కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అగ్గై మండుతున్న తెలంగాణం.సర్కార్ విధానాలపై జనం తిరగబడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు…
తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతాం.. అవకాశవాదుల నుంచి కాపాడుకుంటాం అని నవీన్ తెలిపారు..