ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు సేవలందిస్తూ ప్రసవాల సంఖ్యను పెంచాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్…….. ఆదర్శ సురభి
వనపర్తి
వనపర్తి జిల్లా
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు 24 గంటలు సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్యాధికారులను ఆదేశించారు.
ఉదయం వనపర్తి జిల్లా మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చిన్న పిల్లల వార్డు, ప్రసూతి వార్డు, శస్త్ర చికిత్సల వార్డు, ఎస్ ఎన్.సి. యు వార్డులను పరిశీలించారు.
ఆసుపత్రిలో ఉన్న బెడ్ ల వివరాలు, వివిధ రకాలైన రిజిస్టర్లను పరిశీలించారు. రోజుకు ఎన్ని ఒ.పి లు నమోదు అవుతున్నాయి, ప్రసవాలు ఎన్ని, ఇతర ఆసుపత్రులకు రేఫర్ చేసిన రిజిస్టరును పరిశీలించారు.
24 గంటలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలసి, ప్రైవేటుకు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు అధికంగా జరిపించే విధంగా కృషి చేయాలని ఆదేశించారు.
అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఆర్.యం.ఒ
డా. బంగారయ్య, గైనకాలజిస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ డా. అరుణ కుమారి, వైద్య సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు సేవలందిస్తూ ప్రసవాల సంఖ్య
Related Posts
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యం
TEJA NEWS తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ పలు సమస్యల పై గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించడం…
మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ ఫుడ్ కోర్ట్ నుండి యశోద హాస్పిటల్
TEJA NEWS మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ ఫుడ్ కోర్ట్ నుండి యశోద హాస్పిటల్ వరకు మరియు భారత్ పెట్రోల్ పంపు నుండి హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ వరకు రూ.262.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న సర్వీస్ రోడ్డు…