TEJA NEWS

రద్దీ దృష్ట్యా సింగరేణి స్కూల్ బస్సుల సంఖ్యను పెంచాలి…

ఏరియా ఎస్ ఓ టు జి ఎం డి. శ్యాంసుందర్ కి వినతిపత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు

మణుగూరు ఏరియా పివి కాలనీ సింగరేణి పాఠశాలకు విద్యార్థిని విద్యార్థుల పెరుగుతున్న రద్దీ రీత్యా స్కూల్ బస్సుల సంఖ్యను పెంచాలని కోరుతూ మణుగూరు సామాజిక సేవకులు కర్నే బాబురావు ఏరియా ఎస్ ఓ టు జి ఎం డి. శ్యామ్ సుందర్ కి వినతి పత్రం అందజేసినట్లు బాబురావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి పాఠశాలలకు సెంట్రల్ సిలబస్ ప్రవేశపెడుతున్నారన్న సీఎండి బలరాం హామీ సింగరేణి పాఠశాలలకు ఉన్న పేరు ప్రఖ్యాతులు ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్ల నేపథ్యం పివి కాలనీ సింగరేణి పాఠశాలకు విద్యార్థిని విద్యార్థుల చేరికలు రద్దీ పెరగటంతో పాటు సింగరేణి సామాజిక బాధ్యతలో భాగంగా శ్రీ సత్య సాయి చెవిటి మూగ పాఠశాల విద్యార్థుల రాకపోకలకు కూడా ఈ బస్సులే ఆధారం అని దీంతో కొత్తగా ప్రవేశపెట్టిన బస్సులు సరిపోవటం లేదని అదనంగా మరి కొన్ని బస్సులు పెంచాలని కోరారు అలాగే వీరినంత త్వరగా వీలైనంత త్వరగా సెంట్రల్ సిలబస్ పాఠ్యాంశాలు బోధన ప్రారంభించాలని క్రీడలు కళలలో నేటి బాలలే రేపటి పౌరులని మంచి పౌరులుగా తీర్చిదిద్దడంతో పాటు అన్ని అంశాలలో పాఠశాల పై సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ పర్యవేక్షణ ఉండాలని ఆయన కోరారు తమ విజ్ఞప్తిని మన్నించి సకాలంలో బస్సులు ప్రారంభించినందుకు సింగరేణి యాజమాన్యానికి ఏరియా జిఎం కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


TEJA NEWS