శిక్షణ తరగతులను అధికారులు సద్వినియోగం చేసుకోవాలి

శిక్షణ తరగతులను అధికారులు సద్వినియోగం చేసుకోవాలి

TEJA NEWS

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల

……

ఈనెల 27న జరగనున్న వరంగల్ – ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలలో భాగంగా ఎన్నికల సిబ్బందికి సోమవారం ఐ డి ఓ సి కార్యాలయంలోని సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల మాట్లాడుతూ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. 26వ తారీఖున శ్రీ రామచంద్ర ఆర్ట్స్ కాలేజ్ నందు అందరికీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంటుంది అదేవిధంగా 27వ తారీఖున రిసెప్షన్ కూడా అక్కడే ఉంటుంది అని తెలిపారు గత పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లకు భిన్నంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నందు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ వైస్ గా నెంబర్ ద్వారా ఓటు వేయవలసిందిగా పోలింగ్ స్టేషన్లో ఇచ్చిన వైలెట్ కలర్ స్కెచ్ పెన్ అనే వాడవల్సిందిగా ఇంకా ఏ విధమైన నెంబర్లు కాని పేర్లు కానీ సిగ్నేచర్ లు కానీ రాయకూడదని తెలియజేశారు బ్యాలెట్ బాక్స్ ల ద్వారా బ్యాలెట్ పేపర్ ని నిలువుగా ముందు తర్వాత అడ్డంగా మడిచి బ్యాలెట్ పేపర్ను బ్యాలెట్ బాక్స్ లో వేయవలసిందిగా తెలియజేశారు. ముఖ్యమైన నిబంధనలు పట్ల అవగాహన కలిగి ఉంటే నమ్మకంతో పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించవచ్చుని కలెక్టర్ అన్నారు. పోలింగ్ జరిగే సమయంలో పోలింగ్ కేంద్రాల్లో పాటించాల్సిన నిబంధనలు, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివి ప్యాడ్ మధ్యలో కనెక్షన్, ఓటింగ్ కంపార్ట్మెంట్ రూపొందించడం, ఓటర్ గోప్యంగా తన ఓటు హక్కును యోగించుకునేందుకు అవకాశం కల్పించడం వంటి ఏర్పాట్లపై ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు తీసుకోవలసిన చర్యలు, వారికున్న హక్కులు, బాధ్యతలను సంపూర్ణంగా తెలుసుకొని ప్రతి పోలింగ్ అధికారికి అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగపరచుకొని తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని తెలిపారు. ఎన్నికల సిబ్బంది అందరూ ఫామ్ 12 ని ఉపయోగించుకొని ఐ డి ఓ సి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకొనుటకుగాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని, అందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ, ఎన్నికల సూపర్డెంట్ ధారా ప్రసాద్, ట్రైనింగ్ నోడల్ అధికారి అలీమ్, డి ఎల్ ఎం టి పూసపాటి సాయి కృష్ణ, కిరణ్ కుమార్ మరియు పిఓ ఏ పిఓ లు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS