అవినీతి పరుడినే మళ్ళీ కొనసాగిస్తున్న అధికారులు

అవినీతి పరుడినే మళ్ళీ కొనసాగిస్తున్న అధికారులు

TEJA NEWS

అవినీతి పరుడినే మళ్ళీ కొనసాగిస్తున్న అధికారులు

కారోబార్ అవినీతి గురించి పై అధికారులకు నివేదిక ఇచ్చానని చెప్పిన సెక్రెటరీ

డి పి ఒ మరియు మండల ఎం పి ఒ చెప్పడం వల్లే మళ్ళీ తీసుకున్నాం అని సెక్రెటరీ వెల్లడి

డి ఎల్ పి ఒ మరియు డి పి ఒ లకి విషయాలు తెలిసిన చర్యలు లేవు

ఎం ఎల్ ఎ ఆదేశాలు సైతం భేఖాతార్

అధికారుల తీరుపై ప్రజలు అసహనం

ఇన్ని ఆరోపణలు ఉన్నాగాని, మళ్ళీ అతనినే తీసుకోవడం వెనుక కారణం ఎందని అంటున్న ప్రజలు

ఎన్నో ఆరోపణలు ఉన్నాగాని మళ్ళీ అతనినే గ్రామ పంచాయతీలో కారోబార్ గా కొనసాగించడం వెనుక కారణాలు తెలియడం లేదని ప్రజలు వాపోతున్నారు. మండల ఎం పి ఒ మరియు డి పీ ఒ లు అతని మీద ఇంత మమకారం చూపాల్సిన అవసరం ఏంటని ప్రజలు అడుగుతున్నారు. వివరాలలోకి వెళ్తే రుద్రుర్ మండలకేంద్రంలోని అక్బర్ నగర్ గ్రామంలో పంచాయతీ లో పనిచేస్తున్న కారోబార్ అరాచకం అంతా ఇంతా కాదు.
ఖాళీ ప్లాట్లు ఖబ్జా చేయడం, ఇంటి నంబర్లు ఇచ్చుకోవడం అమ్ముకోవడం, రెండు సార్లు పంచాయతీ డబ్బులను దుర్వినియోగం చేయడం, గ్రామంలో ఇంటి ప్లాట్లు కొలిచేందుకు వస్తే 1000 నుండి 1500 రూపాయలు డిమాండ్ చేయడం, తను వాడుకున్న డబ్బులు నెల నెలా కట్ చేస్తున్నారని సమయ పాలన పాటించక పోతే మాజీ సర్పంచ్ తిగుల్ల గాంగామని వరప్రసాద్ అడిగినందుకు ” నీ పని నువు చూసుకో, నువ్వు నాకెంది చెప్పేది” అని మర్యాద లేకుండ మాట్లాడడం, తాగేసి ఇష్టమొచ్చినట్టు ప్రజలను తిట్టడం, ఇన్ని ఆరోపణలు అతనిపై ఉన్న గానీ అతనినే పెట్టుకోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎం ఎల్ ఎ పోచారం సైతం అతనిని తీసేయండి అని రెండుసార్లు చెప్పిన గానీ ఎం ఎల్ ఎ ఆదేశాలు భేఖతార్ చేసి అధికారులు అతనిపై ఎందుకంత మమకారం చూపిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ప్రజలకు అక్కరకు వచ్చే వ్యక్తిని పెట్టాలి గానీ, అహంకారం నిండి ఉన్న వ్యక్తులు పంచాయతీలో పనికిరారు అని , దయచేసి కోత్తవాల్లని తీసుకోవాలని పేర్కొన్నారు. లేని యెడల ప్రజా దర్బార్ కు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని, అధికారుల పనితీరు సైతం ముఖ్యమంత్రికి తెలియజేస్తామని, జిల్లా కలెక్టర్ కు నివేదిక ఇచ్చామని తెలియజేశారు

Print Friendly, PDF & Email

TEJA NEWS