Spread the love

హరిశ్చంద్రాపురం–నకరికల్లు ప్రాజెక్ట్ నిర్మాణంపై ప్రభుత్వ వైఖరి ఏమిటి? నాగార్జున సాగర్ కుడికాలువపై ఉన్న లిఫ్ట్ వ్యవస్థను తక్షణమే పునరుద్ధరించాలి: మాజీమంత్రి ప్రత్తిపాటి

  • నాగార్జున సాగర్ కుడికాలువ మరమ్మతులు పూర్తిచేసి, లిఫ్ట్ వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను : ప్రత్తిపాటి.
  • వైసీపీ ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ల నిర్వహణను పూర్తిగా విస్మరించింది. కనీసం షట్టర్లకు గ్రీజుకూడా పెట్టకుండా రైతుల ప్రయోజనాలను గాలికి వదిలేసింది : పుల్లారావు

ఆయకట్టు స్థిరీకరణ పెంపునకు టీడీపీప్రభుత్వం కృషి చేస్తే, గత ప్రభుత్వం ఉన్న ఆయకట్టుని నిర్వీర్యం చేసిందని, గోదావరి, కృష్నా, పెన్నా నదుల అనుసంధానంలో భాగంగా రూ.6వేల కోట్లతో నిర్మించతలపెట్టిన హరిశ్చంద్రాపురం–నకరికల్లు ప్రాజెక్ట్ కి టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్ల ను కూడా ఫైనల్ చేసిందని, ఆ ప్రాజెక్ట్ లో గత ప్రభుత్వం రూపాయి పనిచేయలేదని, ఆప్రాజెక్ట్ ను ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సభాముఖంగా ప్రశ్నించారు.

గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయకట్టు స్థిరీకరణ : కాలువల ఆధునికీకరణ అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన సాగు, తాగునీటి సమస్యలపై ప్రభుత్వ వివరణ కోరారు.

హరిశ్చంద్రాపురం-నకరికల్లు ప్రాజెక్ట్ ను బనకచర్లలో విలీనం చేసే ఆలోచన ఉందా?
నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలోని లిఫ్ట్ లను ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలి

హరిశ్చంద్రాపురం-నకరికల్లు ప్రాజెక్ట్ ను బనకచర్ల ప్రాజెక్ట్ లో విలీనంచేసే ఆలోచన ఏమైనా ఉందా లేక టెండర్లు ఖరారైనందున నిర్మాణం పూర్తిచేస్తారా అని ప్రత్తిపాటి ప్రశ్నించారు. నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలో గత ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్న ప్రత్తిపాటి, సాగర్ కాలువ నిర్వహణకు కూడా సరిగా నిధులు కేటాయించలేదన్నారు. నాచు, గుర్రపుడెక్క, పూడికతో నిండిపోయిన కాలువ నుంచి నీటిసరఫరా సక్రమంగా జరగక దిగువ ప్రాంత రైతులు సాగు కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. వైసీపీ హయాంలో కాలువపై ఉన్న షట్టర్లకు కనీసం గ్రీజు కూడా పెట్టలేదని ప్రత్తిపాటి తెలిపారు. ఆ కాలువపై ఆధారపడిన 200లకు పైగా లిఫ్ట్ ఇరిగేషన్లను జగన్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్లకు అవసరమైన మరమ్మతులు చేయించి, రైతులను.. గ్రామాలను ఆదుకోవాలని, కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని మాజీమంత్రి ప్రత్తిపాటి, జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడిని కోరారు.