Spread the love

నాడు జాతీయ రహదారి విద్యుత్ దీపాలు వెలగక వెలవెల

నేడు శోభాయ మానంగా విద్యుత్ దీపాలు తో జాతీయ రహదారి

చిలకలూరిపేట: రాత్రి సమయంలో ఏదైనా పట్టణంలోకి అడుగుపెట్టే సమయంలో రహదారిపై వెలిగే విద్యుత్ దీపాలు ఆ పట్టణ శోభను ఇముడింపజేస్తాయి. చిలకలూరిపేట జాతీయ రహదారి పై నుంచి పట్టణంలోకి అడుగుపెట్టే క్రమంలో క్రమంలో విద్యుత్ దీపాలు వెలకకపోవటం అనేక ప్రమాదాలకు హేతువు గా మారటమే కాకుండా పట్టణ దుస్థితికి అద్దం పట్టింది. గత పాలకులు ఈ విషయాన్ని దృష్టిలో తీసుకోకుండా గాలికి వదిలేయడంతో గత కొన్ని నెలలుగా జాతీయ రహదారిపై విద్యుత్ దీపాలు అంధకారంలో ఉండిపోయింది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఈ విషయాన్ని పరిశీలించారు. వెంటనే జాతీయ రహదారిపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు చిలకలూరిపేట మున్సిపల్ డి ఈ షేక్ అబ్దుల్ రహీం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై విద్యుత్ దీపాల ఏర్పాటు మరమ్మత్తుల పనులు చేపట్టారు. దీంతో జాతీయ రహదారి కిరువైపులా విద్యుత్ కాంతులతో శోభాయమానంగా మారింది.