మూడవ రోజు అన్నపూర్ణ దేవికి ఘనంగా పూజలు
శంకర్పల్లి : దేవీ నవరాత్రులలో మూడో రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో పూజిస్తారు. కొండకల్ గ్రామం లో అన్నపూర్ణ దేవికి చరణ్ సార్క్ ప్రాజెక్ట్స్ వారి ఆధ్వర్యం లో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం. సాక్షాత్ అన్నపూర్ణాదేవి కటాక్షం. ఆ పరమాత్మే ఆదిభిక్షువుగా భిక్షను స్వీకరించినట్లుగా మనకు అనేక పురాణ గాథల ద్వారా తెలుస్తోంది. అన్నం ప్రతి జీవిలోనూ ప్రాణశక్తికి ఆధారం. అందుకే మనం భోజనం చేసే ముందు, ప్రతిసారి అన్నం ఆ భగవంతుని ప్రసాదంగా భావించి కృతజ్ఞతలు తెలుపుకుంటే ఎంతో తృప్తిగా ఉంటుందని అన్నారు. అన్నపూర్ణ దేవి పూజకు ప్రజలు పాల్గొన్నారు