TEJA NEWS

సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అర్హులకు వివిధ సంక్షేమ పధకాలు లభించేలా కృషి చేస్తామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సితాఫలమండీ, బౌద్దనగర్ మునిసిపల్ డివిజన్లకు చెందిన సుమారు 155 మంది లబ్దిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పద్మారావు గౌడ్ మధురానగర్ కమ్యూనిటీ హాల్ లో అధికారులు, కార్పొరేటర్లు, వివిధ పార్టీల నేతలతో కలిసి అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్దిదారులకు వీలైనంత తొందరగా వారికి లభించాల్సిన ప్రయోజనాలు అందించేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు జరపాలని పద్మారావు గౌడ్ సూచించారు. కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, రాసురి సునీత రమేష్, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, మరేడుప్పల్లి తాసిల్దార్ అశోక్, ముషీరాబాద్ తాసిల్దార్ గోవర్ధన్, నాయకులు పాల్గొన్నారు


TEJA NEWS