తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి విక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాల వాడుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా.. పీచు మిఠాయి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

తప్పులు ఒప్పుకోకుండా ఎదురుదాడికి దిగడం సరికాదు: సీఎం రేవంత్‌రెడ్డి గత ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టులపై విశ్రాంత ఇంజినీర్లతో కమిటీ వేసింది: సీఎం రేవంత్‌రెడ్డి విశ్రాంత ఇంజినీర్ల కమిటీ నివేదికను సభ ముందు ఉంచుతున్నా తమ్మడిహట్టి వద్ద కాకుండా మరోచోట ప్రాజెక్టు రీడిజైనింగ్‌కు ఇక్కడే పునాది పడింది గత ప్రభుత్వం తప్పులు ఒప్పుకొని తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేది తప్పులు ఒప్పుకోకుండా ఎదురుదాడికి దిగడం సరికాదు మంత్రి ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ను తప్పుల తడక…

కూలిపోవడం కొత్త కాదు: హరీశ్ రావు ప్రాజెక్టులు, నిర్మాణాలు కూలిపోవడం కొత్త కాదని హరీశ్ రావు చెప్పారు. గతంలో జరిగిన ఘటనలను ఈ సందర్భంగా వెల్లడించారు. దేవాదుల ఫేస్-3 టన్నెల్ అప్పట్లో కూలిపోయింది. సింగూరు డ్యాం గేట్లు కొట్టుకుపోయాయి. పంజాగుట్ట ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉండగానే పడిపోయింది. కాంగ్రెస్ హయాంలోనే మూసీ గేట్లు కొట్టుకుపోయాయి. ఏపీలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది అని తెలిపారు. కాళేశ్వరం విషయంలో తప్పు జరిగితే బాధ్యులను శిక్షించాలని…

సజ్జల రామకృష్ణా రెడ్డిని కలిసిన పాతపట్నం నియోజక వర్గ వైఎస్సార్సీపీ అసమ్మతి నేతలు ఈ కలయిక పాతపట్నం నియోజక వర్గంలో హాట్ టాపిక్ గా మారింది అమరావతి : వైసిపి అధిష్టానం పిలుపు మేరకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో గౌరవ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామ కృష్ణారెడ్డిని కలిసిన పాతపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మరియు హిరమండలం మండలం ప్రత్యేక ఆహ్వానితులు ఎంపీపీ ప్రతినిధి శ్రీ తూలుగు తిరుపతిరావు మాస్టారు, కొత్తూరు వైస్ ఎంపీపీ…

నేడు కేసీఆర్‌ బర్త్‌ డే.. రాష్ట్రవ్యాప్తంగా పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్.. తెలంగాణకు తొలి సీఎంగా 9 ఏళ్ల పాటు పని చేశారు. నేడు కేసీఆర్‌ 70వ బర్త్‌ డే నేడు.. ఈ సందర్భంగా హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గులాబీ దళపతి అభిమానులు, పార్టీ శ్రేణులు కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలకు రెడీ అవుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, అనాథలకు సహాయం ఎప్పటిలాగే చేసేందుకు పార్టీ…

ఎల్లిగడ్డకు కిలో రూ.500.. పంటపొలాల్లో సీసీ కెమెరాలు.. Garlic price: అల్లం, వెల్లుల్లి ధరలు కనివిని ఎరుగని రీతిలో ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం వెల్లుల్లి కిలో ధర 500 రూపాయల మార్క్‌ దాటింది. అటు అల్లం కూడా కిలో 300 నుంచి 350 రూపాయలకి చేరింది.. ఇప్పుడు ఎల్లిగడ్డలు బహిరంగ మార్కెట్ లో కిలో ధర 500 రూపాయలకు పెరిగింది. దీంతో పంట పొలాల నుంచే వాటిని కొందరు దుండగులు ఎత్తుకెళ్తున్నారు. దీంతో పంటను కాపాడుకోవడం కోసం…

లాల్‌ సలామ్‌ మూవీ రజనీకాంత్‌ సినిమా కెరియర్‌లోనే బిగ్‌ డిజాస్టర్‌గా నిలిచింది. సుమారు రూ.90 కోట్ల బడ్జెట్‌తో ‘లాల్ సలామ్’ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా కోలీవుడ్‌లోనే దారుణమైన కలెక్షన్స్‌ను తెచ్చుకుంది. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.27కోట్లు రాబట్టింది. నెట్‌ పరంగా చూస్తే కేవలం రూ. 15కోట్లు మాత్రమే. దీంతో ఈ సినిమా భారీ నష్టాల్లో కూరుకుపోయింది

నుంచి భాజపా జాతీయ మండలి సమావేశాలు సార్వత్రిక ఎన్నికలకు ముందు భాజపా కీలక భేటీ పార్టీ ప్రచార కమిటీ, ప్రధాని అభ్యర్థిగా మోదీని ఎన్నుకోనున్న భాజపా భాజపా జాతీయ మండలి సమావేశాల్లో రాజకీయ, ఆర్థిక తీర్మానాలు రామ మందిర నిర్మాణంపై పదాధికారుల అభినందన తీర్మానం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి మైదాన్‌ భారత మండపంలో జాతీయ మండలి భేటీ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించనున్న భాజపా పార్టీ ఎన్నికల ప్రచార సారథిగా కూడా…

పుష్ప-3 ఉంది: అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’. ఈ నేపథ్యంలో బెర్లిన్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పుష్ప సినిమాకు మూడో పార్ట్ కూడా ఉంటుందని అల్లు అర్జున్‌ ప్రకటించారు. ఓ ఫ్రాంచైజ్‌లా పుష్ప సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరంలో మేడిగడ్డ కీలక బ్యారేజీ అన్నారు. దురదృష్టవశాత్తు నాణ్యతాలోపంతో బ్యారేజీ కుంగిందన్నారు. అవినీతి, నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు పూర్తి దెబ్బ తిందన్నారు. వందేళ్లు ఉండాల్సిన బ్యారేజీ మూడేళ్లలోనే కుప్పకూలిందన్నారు.