తెలంగాణలో నేడు, రేపు వర్షాలు హైదరాబాద్: జనవరి 23తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. కర్ణాటక నుంచి తెలంగాణ, విదర్భ మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగు తోందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

తిరుపతి జిల్లా… ఇద్దరు గజ దొంగల అరెస్ట్. తిరుపతి పరిసర ప్రాంతాలలో గత మూడు సంవత్సరాలుగా తప్పించుకొని చైన్ స్నాచ్చింగ్, ఆర్థిక నేరాలు చేస్తున్న ఇద్దరు దొంగలు అరెస్టు. ఒంటరిగా వయస్సు పైబడిన ఆడవారే టార్గెట్.. మాయమాటలు చెప్పి.. వారి మెడలోని బంగారు చైన్ లను లాక్కొని పారి పోవడమే వీరి నేర వృత్తి. జిల్లా వ్యాప్తంగా పలు పోలిస్ స్టేషన్ల పరిధిలో సుమారు 14 కి పైగా దొంగాతనములు, చైన్ స్నాచ్చింగ్, మోటార్ సైకిల్ దొంగాతనాలకు…

ధనవంతమైన జిల్లాగా రంగారెడ్డి.. రెండో స్థానంలో హైదరాబాద్.. తెలంగాణలో ధనవంతమైన జిల్లా రంగారెడ్డి ఆవతరించింది. హైదరాబాద్ ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. తెలంగాణలో ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్నది జిల్లాగా రంగారెడ్డి జిల్లా నిలిచింది. పర్ క్యాపిట ఇన్ కమ్ అధారంగా తెలంగాణలో రిచెస్ట్ జిల్లాగా రంగారెడ్డి తొలి స్థానంలో నిలవగా.. హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో సంగారెడ్డి ఉంది. నాలుగో స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి, ఐదో స్థానంలో యాదాద్రి భువనగిరి, ఆరో స్థానంలో…

కొమురవెల్లి మల్లన్న పట్నం వారం ఆదాయం ఎంతంటే చేర్యాల, జనవరి 23 : కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి వారి పట్నం వారం(Patnam vaaram) సందర్భంగా రూ.70,22,307 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఆర్జీత సేవలు, గదులు, దర్శనాలు, ప్రసాదాల విక్రయం తదితర వాటి ద్వారా శనివారం రూ.11,84,726, ఆదివారం రూ.47,82,420, సోమవారం రూ.10,55,161 ఆదాయం వచ్చిందన్నారు. గత సంవత్సరం పట్నం వారానికి రూ. 49,83,819 ఆదాయం(weekly income) మల్లికార్జున…

గ్రూప్‌-1 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఈనెల 28 వరకు అవకాశం అమరావతి జనవరి 23రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సర్వీసులైన గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏపీపీఎస్సీ,ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్రూప్‌-1 దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 28వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపింది. కొత్త అభ్యర్థులు తొలుత కమిషన్‌ వెబ్‌సైట్‌లో తమ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుని..…

రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా నే రోడ్డు ప్రమాదాలను నివారించగలం:జిల్లా ఎస్పీ రితిరాజ్ గద్వాల జనవరి 23 :-రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా నే రోడ్డు ప్రమాదాలను నివారించగలం అని జిల్లా ఎస్పీ రితిరాజ్ తెలిపారు.మంగళవారం జిల్లా కేంద్రం లోని రోడ్ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని రోడ్డు భద్రతా నియమాల పై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా మూడు రోజుల పాటు హెల్మెట్ ధరించిన వారిని…

రాయదుర్గం మీదుగా అయోధ్యకు ఐదు ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైళ్లు.అయోధ్యలో రామ మందిరంలో బాల రాముని విగ్రహ ప్రతిష్ట జరిగిన సందర్భముగా యాత్రికులు ఆలయాన్ని దర్శించే నిమిత్తం నైరుతి రైల్వే ఆరు ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నట్లు నైరుతి రైల్వే అసిస్టెంట్ ట్రాన్స్పోర్ట్ మేనేజర్ బిఎల్ శివకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇవి సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టర్మినల్ బెంగళూరు, మైసూరు, తుంకూరు, చిత్రదుర్గ మరియు వాస్కోడగామా నుండి అయోధ్యకు ప్రత్యేక రైలు ప్రయాణిస్తాయి. ఇందులో వాస్కోడగామా…

రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా అధికార పార్టీ స్ట్రాటజీ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ను ఆమోదించిన స్పీకర్ వైసీపీ కి వచ్చిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, రాపాక వరప్రసాద్ లతో పాటు వైసీపీ నుంచి సస్పెండ్ అయిన మేకపాటి శేఖర్ రెడ్డి, శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లకు సైతం నోటీస్ లు పార్టీ మార్పు పై వారం లోపు సమాధానం చెప్పాలని లేదంటే అనర్హత వేటు…

అయోధ్యలో శ్రీరాముడి దర్శనం కోసం భక్తులు భారీగా ఎగబడ్డారు. దీంతో స్వల్ప తొక్కసలాట జరిగి ఒక భక్తుడు గాయపడ్డాడు. మరోవైపు, మంగళవారం మధ్యాహ్నానికి రామ్లల్లాను రెండు లక్షల మంది దర్శించుకున్నారని అధికారులు తెలిపారు.. అయోధ్య రామయ్య దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే భక్తులు రామ్లల్లా దర్శనం కోసం క్యూ కట్టారు. అలా మంగళవారం మధ్యాహ్ననానికి వేలాది భక్తులు రామాలయ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో రామాలయం రోడ్లన్ని భక్తులతో నిండిపోయాయి.…

బాల రాముడికి భారీ కానుక.. ₹11 కోట్ల విలువైన వజ్రరత్నఖచితమైన బంగారు కిరీటాన్ని బహూకరించిన గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి ముఖేష్ పటేల్..