- నేత్రపర్వం ఆనందనందనుడి కల్యాణ క్రతువు…!
- శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న దయాకర్ రెడ్డి
……
పాలేరంతా రామమయమైంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఖమ్మం రూరల్ మండలంలోని సాయిగణేష్ నగర్, సత్యనారాయణపురం, చిన్నతండా, పెద్దతండా, సాయిప్రభాత్ నగర్, ఆర్.ఎస్.నగర్ తదితర ప్రాంతాల్లో నేత్రపర్వంగా సాగిన ఆనందనందనుడి కల్యాణ క్రతువులో మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పానకం పంపిణీ, అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు