TEJA NEWS

హాజరు కానున్న తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురంలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న విజయాన్ని ఆకాంక్షిస్తూ పాలేరు నియోజక వర్గ సన్నాహక సమావేశం మంగళవారం ఉదయం 10గంటలకు జరగనుంది. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు అభ్యర్థి తీన్మార్ మల్లన్న హాజరవుతారని పేర్కొన్నారు. కావున నియోజక వర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు పట్టభద్రులు అధిక సంఖ్యలో హాజరై వారి మద్ధతును తీన్మార్ మల్లన్నకు తెలపాలని దయాకర్ రెడ్డి కోరారు.


TEJA NEWS