తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేయాలి…….. ఎంఈఓ జయరాములు సెక్టోరల్ అధికారి యుగంధ
వనపర్తి విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి విద్యార్థుల జీవితానికి,భవిష్యత్తుకు బంగారు బాటలు వెయ్యాలని యాపర్ల జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మండల విద్యాధికారి జయరాములు సెక్టోరల్ అధికారి యుగంధర్ లు కోరారు. అనంతరం అదే పాఠశాలలో పనిచేస్తున్న రాష్ట్ర అవార్డు గ్రహీత ప్రధానోపాధ్యాయులు పలుస శంకర్ గౌడ్ ను వారు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ గెజిటెడ్ హెడ్మాస్టర్ నరసింహారావు స్కూల్ హెడ్మాస్టర్ శంకర్ గౌడ్ చైర్మన్ జయం రైతు సంఘం నాయకుడు స్వరాజ్యం బాబు రెడ్డి ఉపాధ్యాయులు ఈశ్వర్ రెడ్డి మనోద్దీన్ వెంకటేశ్వర్లు తల్లిదండ్రులు పాల్గొన్నారు.