TEJA NEWS

రక్తదాన శిబిరం లో పాల్గొనండి అత్యవసర సమయంలో ప్రాణదాతలు కండి : ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా నిర్వహిస్తున్న సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా ఈనెల 25 వ తేదీ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యవంతమైన యువత, ప్రజలు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ కోరారు. మీరు చేసే రక్తదానం అత్యవసర సమయాల్లో ఇతరులకు ప్రాణదానం అవుతుంది అని అన్నారు. రక్తదానం చేసే వారు శుక్రవారం రోజున ఉదయం పుష్టికరమైన ఆహారం తీసుకుని 9 గంటల వరకు సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంకు రావాలని విజ్ఞప్తి చేశారు.


TEJA NEWS