
రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ పేదలకు వరం : పటేల్ రమేష్ రెడ్డి
సూర్యపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపతుడున్న రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ పేదప్రజలకు వరమని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మండలం తాళ్లకాంపాడు గ్రామంలోని రేషన్ దుకాణం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదిరెడ్డి రమణారెడ్డి నాయకత్వంలో జరిగిన పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి పటేల్ రమేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హామిలను 90శాతం అమలు చేసిందని అన్నారు. గత పదేళ్ల బిఆర్ ఎస్ పాలనలో రాష్ట్రం ఆర్దిక దివాళా తీసిందని, కెసిఆర్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని, ప్రస్తుత ప్రభుత్వం నెలకు 6500 కోట్ల రూపాయలు వడ్డిలు కట్టడం జరుగుతుందని అన్నారు.
అయినప్పటికీ ఎన్నికలలో వాగ్దానం చేసిన విధంగా 90లక్షల రేషన్ కార్డు దారులకు, మూడు కోట్ల మంది ప్రజలకు సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయల వ్యయంతో సన్నబియ్యం పంపిణీ చేపట్టడానికి సిఎం రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంన్నారని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పేద ప్రజలు ఆదరించాలని, అండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదిరెడ్డి రమణారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్, ధరావత్ వెంకన్న నాయక్, తండు శ్రీనివాస్, వల్దాసు దేవేందర్, యాట ఉపేందర్, గ్రామ నాయకులు ముదిరెడ్డి చైతన్య రెడ్డి, మాజి ఉప సర్పంచ్ పాముల సైదులు, ఎన్ వెంకటరెడ్డి, పాముల మల్లేష్, నోముల నాగరాజు, ఎలుక సంతోష్, పల్స జానయ్య, చల్లా లింగారెడ్డి, చల్లా కృష్ణారెడ్డి, బూర జానయ్య, శంకర్, వల్లమల్ల రాంబాబు , డీలర్ గోర్ల గన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
