
పిడుగుపాటు మృతురాలి కుటుంబానికి ఆర్థికసాయం అందజేసిన ప్రత్తిపాటి
పొలంపనులకు వెళ్లి పిడుగుపాటుతో మరణించిన షేక్ పర్వీన్ కుటుంబానికి ప్రభుత్వం అందచేసిన రూ.50వేల ఆర్థికసాయం చెక్కును మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అందచేశారు. యడ్లపాడు మండలం కారుచోల గ్రామానికి చెందిన షేక్ పర్వీన్ ఈ నెల 14వ తేదీన కూలిపనులకు వెళ్లినప్పుడు పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన ప్రత్తిపాటి, తాజాగా ఆమె భర్త జాన్ సైదాకు ఆర్డీవో మధులత సమక్షంలో రూ.50వేల చెక్కును అందచేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం కూడా త్వరలోనే అందేలా చూస్తానని ప్రత్తిపాటి చెప్పారు. భార్య మృతితో అధైర్యపడకుండా పిల్లలను జాగ్రత్తగా చదివించి ప్రయోజకుల్ని చేయాలని ప్రత్తిపాటి సైదాకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కామినేని సాయిబాబు, కారుచోలా గ్రామా నాయకులు పాల్గొన్నారు.
