కువైట్ అగ్ని ప్రమాద భారతీయ మృతులకు పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అశ్రునివాళులు

కువైట్ అగ్ని ప్రమాద భారతీయ మృతులకు పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అశ్రునివాళులు

TEJA NEWS

Pavilion ground walkers tearful for Indian casualties of Kuwait fire

కువైట్ అగ్ని ప్రమాద భారతీయ మృతులకు పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అశ్రునివాళులు

ఎడారి దేశం కువైట్ లో భారతీయ కార్మికులు నివాసముండే అపార్ట్మెంట్ నందు జరిగిన అగ్ని ప్రమాదంలో మృతిచెందిన చెందిన 42 మంది భారతీయ మృతులకు పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాకం శ్యామ్ బాబు, కార్మిక నేత మంద వెంకటేశ్వర్లు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నందు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతీయ మృతులకు కొవ్వొత్తులు వెలిగించి అశ్రు నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ. కువైట్ లోని మంగాఫ్ లో ఉన్న ఆల్ మంగాఫ్ అనే ఆరంతస్తుల భవనాన్ని ఎన్ బిటీసి కంపెనీ అద్దెకు తీసుకుందని భవనంలో సుమారు 195 మంది కార్మికులు నివసిస్తున్నారని వారిలో ఎక్కువ సంఖ్యలో కేరళ, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారని తెలిపారు. భవనంలో నివాసముంటున్న కార్మికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో బుధవారం తెల్లవారుజామున భవనంలో ఒక్క సారిగా మంటలు చెలరేగడం మాటలతో పాటు పొగ దట్టంగా వ్యాపించడం వలన ఊపిరాడక ఎక్కువ మంది కార్మికులు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందని మృతుల్లో 42 మంది భారతీయులు ఉండటం మరింత బాధాకరమైన విషయమన్నారు. అగ్ని ప్రమాద ఘటన మృతుల కుటుంబాలకు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వాలు అన్ని విధాలా సహాయసహకారాలు అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ధుర్గేష్, గోపాల్, గోవర్ధన్ కుటుంబరావు, శైలంద్ర, జానకి రామయ్య, లింగయ్య,, రామనాధం, మూర్తి, వెంకట్ బాబు. మాధవి, కళ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS