- దేశములో కాంగ్రెస్ రాబోతుంది రాహుల్ గాంధీ గారు ప్రధాన మంత్రి కాబోతున్నారు
- హిందువుల పార్టీ అని చెప్పుకునే బీజేపీ అగరబత్తిపై కూడా జీఎస్టీ వేసింది
- గ్యారెంటీలకే గ్యారెంటీ మన రాహుల్ గాంధీ
- ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయడం లేదనే బీఆర్ఎస్‌ను ప్రజలు పక్కన పెట్టారు
- జీఎస్టీ తీసుకువచ్చి 54 లక్షల కోట్లను పేదల నుంచి తీసుకున్నారు
- కాంగ్రెస్ పార్టీ
కార్యకర్తలను నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటా - మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ గారిని భారీ మెజార్టీ తో గెలిపించాలి
- బిఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీ లో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి సీతక్క
- ములుగు నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క గారు పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్,రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ రియాజ్,డాక్టర్ అనీల్
తేదీ 25.04.2024
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
కేంద్రంలో అధికారంలోకి రాలేమని తెలిసిన బీజేపీ, ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతూ జైల్లో పెడుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితులలో దేశంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి
కాంగ్రెస్ పార్టీ కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. జీఎస్టీ తీసుకువచ్చి రూ.54 లక్షల కోట్లను పేదల నుంచి వసూలు చేశారని ఆరోపించారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్ని ఇచ్చారో చెప్పాలన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు పదేళ్లలో కూడా నెరవేరలేదన్నారు. జన్ ధన్ ఖాతాలో 15 లక్షలు వేశారా ఒక్క సారి ప్రజలు ఆలోచన చెయ్యాలి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చెయ్యడమే మన లక్ష్యమని కాంగ్రెస్ నేతలకు సూచించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఓటు అడిగే హక్కు లేదన్నారు.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేశామన్నారు. బీఆర్ఎస్ 10 ఏండ్ల పాలనలో రాష్ట్రాన్ని లూటీ చేశారని విమర్శించారు. రైతును రాజును చేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలతో పాటు 10 లక్షల జీవిత భీమా ఇస్తామన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్‌ని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం ములుగు, వేంకటా పూర్, కన్నయి గూడెం,ఏటూరు నాగారం,మంగపేట మండలాలకు చెందిన బిఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరిక వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్,రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ రియాజ్,డాక్టర్ అనీల్,జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు