TEJA NEWS

ప్రజలు డిజిటల్ కార్డ్ సర్వే కు సహకరించాలి
మున్సిపల్ ఛైర్మెన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ

సూర్యపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాతమకంగా చేపట్టిన డిజిటల్ సర్వే కు కావలసిన వివరాలు గృహయజమాలు సర్వే సిబ్బందికి అందివ్వాలి అనీ మున్సిపల్ చైర్మెన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ అన్నారు.. డిజిటల్ సర్వే కు సంబంధించి సూర్యాపేట పట్టణంలోని 37 వ వార్డు నూ ఎంపిక చెసినందున ఆట్టి వార్డు లొ సర్వేనుమున్సిపల్ చైర్మెన్ ప్రారంభించి వివరాలు సేకరించారు.ఆర్.డీ.ఒ వేణు మాధవు మాట్లాడుతూ యిట్టి సర్వే లొ గృహా యజమానులు తమ కుటుంబ సభ్యుల వివరాలు,,ఆధార్ కార్డ్ వివరాలు ,వయస్సు, ఫొన్ నెంబర్లు యిచ్చి ఫోటో దిగాలి అన్నారు.

మున్సిపల్ కమీషనర్ బీ. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం యిచ్చే డిజిటల్ కార్డ్ లవల్ల ప్రభుత్వం ఇచ్చే సంక్షేమపధకాల తొ పాటు, అరోగ్య శ్రి, ఫీజూ రియంబర్స్ మెంట్,రేషన్ కార్డ్ క్రింద ఈ కార్డ్ కుటుంబానికి రక్షణ కవచంగా ఉపయోగ పడుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బైరు శైలేందర్ తహశీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్ది, అర్ ఐ శ్రీదర్, ఎండీ. గౌసుద్దీన్ , యెస్. యెస్.అర్.ప్రసాద్ ,ఇండ్ల మనోజ్ ,ఖదీర్ , మెప్మా టిఎంసి శ్వేత, సీ ఒ లు , అర్ పి లు , అలెటి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS