TEJA NEWS

కొండాపూర్ మండల పరిధి మన్ సాన్ పల్లి, మునిదేవునిపల్లి, గొల్లపల్లి, గుంతపల్లి, గడి మల్కాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దండు శ్రీనివాస్ గుప్త

కొండాపూర్: ప్రజలంతా కాంగ్రెస్ కు అండగా నిలవాలని, తమ పార్టీకి ఓటేసి మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ని గెలిపించాలని శంకర్‌పల్లి మున్సిపల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దండు శ్రీనివాస్ గుప్త కోరారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కి మద్దతుగా దండు శ్రీనివాస్ గుప్త సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరిధిలోని మన్ సాన్ పల్లి, మునిదేవునిపల్లి, గొల్లపల్లి, గుంతపల్లి, గడిమల్కాపూర్ గ్రామాల్లో 15 మంది కార్యకర్తలతో కలిసి ప్రచారం చేశారు. మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దండు శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ కాంగ్రెస్ గెలిస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. బిఆర్ఎస్, బిజెపి నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని, తప్పకుండా మెదక్ గడ్డపై గెలుస్తామని, నీలం మధు ముదిరాజ్ ని పార్లమెంటుకు పంపిస్తామని అన్నారు. కార్యక్రమంలో సిద్దు గౌడ్, అభిషేక్ గౌడ్, మల్లేశం చారి, రాజు, శ్రీహరి, సంతోష్, శ్రీనివాస్, ప్రవీణ్ చారి, మహేష్ చారి, శేఖర్ చారి, విట్టల్, ప్రవీణ్ కుమార్, రాజు, గౌరీశంకర్ చారి, రాములు పాల్గొన్నారు.


TEJA NEWS