దివ్యాంగుల పట్టుదల కృషిని చూసి సవ్యాంగులు స్ఫూర్తిగా తీసుకోవాలి
డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజున బహుమతుల ప్రధానం……….. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
వనపర్తి
దివ్యాన్గుల పట్టుదల కృషిని చూసి సవ్యాంగులు స్ఫూర్తి పొందాలని జిల్లా కలక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.
డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానాములో దివ్యాంగుల క్రీడా పోటీలను నిర్వహించగా జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ట్రై సైకిల్ పరుగు, చేస్, క్యారమ్, షార్ట్ ఫూట్ ఆటల పోటీలు నిర్వహించగా కలక్టర్ ట్రై సైకిల్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో వైకల్యంతో బాధ పడతారని, లక్ష్య సాధనలో అది వైకల్యం మాత్రమే తప్ప అసాధ్యమైనది కాదని కలక్టర్ పేర్కొన్నారు.
దివ్యాంగుల పట్టుదల, ఆత్మస్థైర్యాన్ని సవ్యాన్గులు సైతం స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.
సంక్షేమ శాఖ ద్వారా పార ఒలింపిక్ మాదిరి జిల్లాలో దివ్యాన్గులకు క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని, గెలుపొందిన క్రీడాకారులకు, క్రీడల్లో పాల్గొన్న వారందరికీ డిసెంబర్ 3 న జరిగే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.
జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మమ్మ, జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్, తహసిల్దార్ రమేష్ రెడ్డి, జిల్లా దివ్యాంగుల సంఘం సభ్యులు, దివ్యాంగులైన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు .