
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గోదావరిఖనిలో పర్యటన
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గోదావరిఖనిలో పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం సమీపంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఎంపీ ని అంబేద్కర్ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతించి, శాలువాలతో సన్మానించారు.
పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ అంశాన్ని ప్రస్తావించారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడంతో పాటు, 1989లో మాజీ మంత్రి కాకా వెంకటస్వామి తీసుకువచ్చిన పెన్షన్ స్కీమ్‌ను పునఃసమీక్షించి కనీసం ₹10,000 కి పెంచాలని కోరారు.
అలాగే, రామగుండం ఎన్టీపీసీ అధికారులు నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి కి లేఖ ద్వారా తెలియజేశారు.
పార్లమెంట్ పరిధిలో అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు, పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, దళితుల అభ్యున్నతికి కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు రావడానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు.
