TEJA NEWS

డ్రైనేజీ సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం…
మల్కాజిగిరి :
మల్కాజిగిరి నియోజకవర్గం,నేరేడ్ మెట్ డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో గత కొన్ని రోజులుగా డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా కాలనీ వాసులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన మైనంపల్లి అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించాలని అధికారులను కోరారు. వాటర్ వర్క్స్ అధికారులు, మున్సిపల్ అధికారులు, స్థానిక కాలనీవాసుల తో కలిసి వాళ్ళ సమస్యలపై పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ డ్రైనేజీ సమస్యను త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డిజిఎం రాజు, ఏఈ కృష్ణ ప్రసాద్, మున్సిపల్ ఏఈ సృజన, స్టానిక కాలనీ వాసులు మధుసూదన్, మనోజ్, నేరేడ్ మెట్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు కే చెన్నారెడ్డి, కుట్టి శ్రీను, యాది, ఎన్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS