బాణాసంచా దుకాణాలకు అనుమతులు తప్పనిసరి.
- పరవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్.మల్లికార్జునరావు
దీపావళి సందర్భంగా పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతి లేకుండా అక్రమంగా బాణాసంచా నిల్వ చేయడం గాని, అమ్మడం ఎవరు పాల్ప డరాదని పరవాడ సీఐ మల్లికార్జునరావు పత్రిక ప్రకటనలో తెలిపారు. ఒకవేళ ఆ విధంగా ఎవరైనా చేసినట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అక్రమ బాణాసంచా గురించి ప్రజలకు ఎటువంటి సమాచారం తెలిసిన సరే పోలీసు వారికి వెంటనే తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. అనుమతి తీసుకుని బాణాసంచా అమ్ముతున్న వాళ్ళు తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని కూడా తప్పనిసరిగా పాటించాలని పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలియజేసారు..