TEJA NEWS

Phase-wise loan waiver

దశల వారీగా రుణమాఫీ?

సీఎం రేవంత్ కేసీఆర్ ను ఫాలో అవుతారా?

జులై 15 నుంచి దశలవారీగా రుణమాఫీ చేయనుందట రేవంత్‌ సర్కార్‌. ఆగస్టు 15లోగా రూ. 2 లక్షల రైతు రుణమాఫీకి ప్రభుత్వం పలుమార్గాలు అన్వేషిస్తుంది.

జులై 15 నుంచి రూ. 50వేల లోపు, ఆ తర్వాత రూ. 75వేలు, రూ. లక్ష….ఇలా పెంచుతూ బ్యాంకులకు జమ చేసే విధానాన్ని పరిశీలిస్తోంది. రైతుల్లో 70% మందికి రూ. లక్ష లోపు రుణం ఉన్నట్లు అంచనా. తొలి దశలో వీరికి మాఫీ చేసి మిగిలిన వారికి ఆగస్టు 15లోగా జమ చేయాలనే అంశంపైనా చర్చ సాగుతోంది.

నిధుల లభ్యతపై స్పష్టత వచ్చాక అర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలవుతుందట. ఇక అటు రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా పథకాలకు 2 నెలల్లో రూ. 30 వేల కోట్లు అవసరమని ప్రభుత్వ అంచనా. ఆగస్టులోగా ఆ మేర రుణాలు తీసుకుంటేనే స్కీమ్ ల అమలు సాధ్యమని సమాచారం. బాండ్ల విక్రయం ద్వారా అప్పు తీసుకోవాలని నిర్ణయించింది. అయితే ఏప్రిల్, మేలో రూ. 8,246 కోట్లు సేకరించగా….మరో రూ. 2వేల కోట్లు 3 రోజుల్లో తీసుకొనుంది. ఈ ఏడాది కోటాలో మరో రూ. 30 వేల కోట్లు తీసుకునేందుకు RBI అంగీకరిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.


TEJA NEWS